![]() |
![]() |

పెళ్ళి వయసుకొచ్చిన అమ్మాయిలకు సరైన సమయంలో పెళ్ళి కాకుంటే ఆ ఇంట్లోని పెద్దొళ్ళకు కాస్త టెన్షతో పాటు దిగులుంటుంది. అందులోని అమ్మాయి తల్లితండ్రులకీ మరీను. కొంతకాలం క్రితం రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయాడు. అమ్మే అన్నీ చూసుకుంటుంది. అయితే అన్నీ ఉన్న ఆమెకు తన కూతురు పెళ్ళి కావట్లేదనే దిగులు ఏర్పడిందంట.. ఆ విషయాన్ని రీతు చౌదరి స్వయంగా చెప్పింది.
రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
మా పెళ్ళి గురించి అమ్మ ఇలా ఐపోతుందని అనుకోలే అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది రీతు. తన పెళ్ళి గురించి వాళ్ళ అమ్మ ఎమోషనల్ అయింది. ఈ వ్లాగ్ లో వాళ్ళ అమ్మ టీవీ చూస్తూ ఎమోషనల్ అయిందని.. అందులో అందరు అమ్మనాన్నలతో కొడుకు, కూతుళ్ళతో హ్యాపీగా ఉండటం చూసి.. మా నాన్న కూడా ఉండి ఉంటే బాగుండేదంటూ మా అమ్మ ఏడ్చేసిందని రీతు చెప్పుకొచ్చింది. మనం వాళ్ళకి పెద్దగా ఏం చేయనవసరం లేదు ఇలాంటి సందర్భంలో తనని హ్యాపీగా ఉంచడానికి అలా బయటకు తీసుకెళ్దామనుకుంటున్నాని చెప్పి తనని బయటకు తీసుకెళ్ళింది రీతు. ఇదంతా తను చేసిన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది రీతు చౌదరి. కాగా ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |